ఐదేళ్లలోపు పిల్లలందరికీ విధిగా పోలియో చుక్కలు వేయించాలని ఆదిలాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్ సూచించారు. చిన్నారుల నిండు జీవితాలకు రెండు చుక్కలు ఎంతో మేలు చేస్తాయని ఆయన తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు.
'నిండు జీవితానికి రెండు చుక్కలు.. విధిగా వేయించాలి' - తెలంగాణ వార్తలు
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్ ప్రారంభించారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ విధిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.
'నిండు జీవితానికి రెండు చుక్కలు.. విధిగా వేయించాలి'
తొలుత చిన్నారులకు ఆయనే పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ జయవంత్ రావు, జడ్పీటీసీ సభ్యురాలు చారులు తదితరులు పాల్గొన్నారు.