'చచ్చేంత వరకు ఉరి తీయమన్నారు'
'చచ్చేంత వరకు ఉరి తీయమన్నారు' - samatha case news
సమత హత్యాచారం కేసులో దోషులకు ఉరిశిక్ష పడింది. ఈ కేసులో తుదితీర్పు వెల్లడించిన ఆదిలాబాద్ ప్రత్యేకకోర్టు షేక్ బాబు, షేక్ షాబోద్ధీన్, షేక్ మఖ్దూం దోషులుగా నిర్ధరిస్తూ... మరణశిక్ష విధించింది. ప్రత్యేక కోర్టులో 50 రోజులు విచారణ కొనసాగినట్లు పీపీ తెలిపారు. నేరం జరిగిన 66 రోజుల్లో దోషులకు శిక్ష ఖరారైందని వెల్లడించారు. ముగ్గురు దోషులకు రూ.26 వేలు జరిమానా విధించినట్లు స్పష్టం చేశారు. అప్పీల్ అనేది వారి హక్కు అని.... వారు కోరితే ప్రభుత్వమే న్యాయవాదిని ఏర్పాటు చేస్తుందని వివరించారు.
!['చచ్చేంత వరకు ఉరి తీయమన్నారు' public-prosecution-talk-about-samatha-case](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5893091-thumbnail-3x2-kee.jpg)
'చచ్చేంత వరకు ఉరి తీయమన్నారు'