ఎంపీ సోయం బాపురావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని భాజపా ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్ హెచ్చరించారు. బాపురావుపై ఎమ్మెల్యే జోగు రామన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఉట్నూరు మండల కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో ఎమ్మెల్యే, పార్టీ కార్యకర్తలు బైఠాయించారు.
'ఎంపీ సోయం బాపురావుకు క్షమాపణ చెప్పాలి' - ఎంపీ సోయం బాపురావుపై ఎమ్మెల్యే జోగురామన్న వ్యాఖ్యలు
ఎంపీ సోయం బాపురావుపై ఎమ్మెల్యే జోగురామన్న చేసిన వ్యాఖ్యలపై భాజపా నాయకుడు కొండేరి రమేష్ ఆందోళన చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించారు.
ఉట్నూరు, ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్, ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే జోగురామన్న
ఎంపీపై జోగు రామన్న అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదని ఆయన అన్నారు. వెంటనే తాను చేసిన వ్యాఖ్యలను రామన్న వెనక్కి తీసుకొని ఎంపీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:అరవైలో ఇరవైలా.. గుర్రంపై 'తాత' స్వారీ!