'హథ్రస్ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి' - up hathras incident news in adilabad
ఉత్తర్‌ప్రదేశ్‌లో జరుగుతున్న వరుస అత్యాచారాలకు నిరసనగా ఆదిలాబాద్‌లో దళితసంఘాలు ఆందోళన బాట పట్టాయి. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. హథ్రస్ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
!['హథ్రస్ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి' protest against up hathras incident by dalith communities at adilabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9013867-1050-9013867-1601568230032.jpg)
'హథ్రస్ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి'
ఉత్తర్‌ప్రదేశ్ హథ్రస్ ఘటనపై ఆదిలాబాద్‌లో దళితసంఘాలు నిరసన తెలిపాయి. వరుస అత్యాచారాలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. దళితుల ఐక్యత వర్ధిల్లాలి అంటు యూపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.