తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతులకు ఉచిత విద్యుత్ అమలు గగనమే' - ఆదిలాబాద్​లో విద్యుత్ ఉద్యోగుల నిరసన

విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్​లో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ విద్యుత్ సంస్థలను నిర్వీర్యం చేసే కుట్రలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలు తమకు సహకరించాలని కోరారు.

protest against electricity privatization
'రైతులకు ఉచిత విద్యుత్ అమలు గగనమే'

By

Published : Oct 5, 2020, 4:41 PM IST

విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆదిలాబాద్​లో సంబంధిత శాఖ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. భోజన విరామ సమయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్రం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరిస్తే రైతులకు ఉచిత కరెంట్ అమలు గగనమేనని ఉద్యోగుల సంఘం నాయకులు సత్తయ్య పేర్కొన్నారు.

ప్రభుత్వ విద్యుత్ సంస్థలను నిర్వీర్యం చేసే కుట్రలను ప్రజలు తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు . తమ ఆందోళనకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. ప్రభుత్వం తన తీరు మార్చుకోకపోతే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: 'రైతులను అంతం చేయడానికే వ్యవసాయ చట్టాలు'

ABOUT THE AUTHOR

...view details