తెలంగాణ

telangana

ETV Bharat / state

జనావాసాల్లోకి వన్యమృగాలు.. రక్షణ చర్యలు ఎలా? - Wildlife protection

Protection from wild animals: మానవులు చేస్తోన్న కొన్ని పకృతి వినాశక చర్యలు వల్ల అడవిలో సేదతీరాల్సిన వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తోన్నాయి. వాటి ఆహారం కోసం గ్రామాల్లోకి వచ్చి మనుషులపై దాడి చేసి పెంపుడు జంతువులను సైతం బలి తీసుకుంటున్నాయి. ఇటివలే కాలంలో ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో ఈ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటే వాటి నుంచి రక్షించుకోవచ్చని అంటున్నారు ఫారెస్టు అధికారులు.

Protection from wild animals
Protection from wild animals

By

Published : Nov 16, 2022, 3:03 PM IST

Protection from wild animals: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ మధ్య కాలంలో పులులు సంచారం రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఒంటరిగా పోలాలకు వెళ్లాలంటే రైతులు భయపడిపోతున్నారు. అడవిలో సేదతీరాల్సిన వన్యమృగాలు గ్రామాలోకి చొరబడి మానవుల ప్రాణాలు తీస్తున్నాయి. మానవులు చేస్తున్న కొన్ని పకృతి వినాశక పనులు వల్ల వన్యమృగాలు వాటి ఆవాసాలు కోల్పోయి జనవాసాల్లోకి వచ్చి వాటి ఆహారం కోసం వెతుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

తాజాగా అదిలాబాద్ జిల్లాలో నాలుగు పులులు సంచరిస్తోన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​కాగా అక్కడవారు ఆ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లాలంటే భయపడి పోతున్నారు. మంగళవారం కుమురం భీం జిల్లాలో పొలంలో పని చేసుకుంటున్న రైతును పెద్ద పులి ఈడ్చుకెళ్లి చంపిన ఘటన ఆ జిల్లాలో ఎంత కలవరానికి గురి చేసిందో అందరికి తెలుసు.. ఇలాంటి ఘటనలు నుంచి కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటే వాటి బెడద నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు అటవీ శాఖ అధికారులు.

ఆదిలాబాద్‌ జిల్లా అటవీప్రాంతంలో అంద్‌గూడకు చెందిన జనార్దన్‌ తన పంట పొలంలో నిర్మించుకున్న మంచె

పొలంలోకి వెళ్లేనప్పుడు రైతులు గుంపుగా వెళ్లాలని సూచిస్తున్నారు. చేతిలో కర్ర మరైదైన ఆయుధం ఉండాలని అంటున్నారు. వన్యప్రాణులు ఎదురుపడినప్పుడు గుండె ధైర్యం తప్పనిసరి.. పొలాల్లో.. ఎత్తైనా ప్రదేశంలో లేదా చెట్లపై మంచెలు ఏర్పాటు చేసుకుంటే అడవి జంతువులు నుంచి కొంత రక్షణ ఉంటుందని ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details