అదిలాబాద్ జిల్లా ఏజెన్సీ కొండా కోనా ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీలు ఆది నుంచి నేటి వరకు వారి సంస్కృతి సంప్రదాయాలు, పండుగలను, ఆటలను కాపాడుకుంటూ వస్తున్నారు. ఆదివాసుల ఆచార వ్యవహారాలను సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరంతో పాటు రానున్న తరాల వారికి అందించేందుకు కృషి చేస్తున్నారు. ఏటా అకాడి పూజల అనంతరం శ్రావణ మాసం ప్రారంభం నుంచి శివ పూజలు నిర్వహిస్తామని ఆదివాసీలు వివరించారు. అనంతరం పశు పక్ష్యాదులు పిల్లా జెల్లా సుఖంగా ఉండాలని కోరుకుంటూ మొక్కులు తీర్చుకుంటామన్నారు.
కొడంగల్ ఆట...