నెలలు నిండిన ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి బయల్దేరిన వారికి వాగు రూపంలో ఆటంకాలు ఏర్పడ్డాయి. చేసేది లేక పురిటి నొప్పులను(labour pains) పెదవిచాటున అదిమిపెడుతూ ఎడ్లబండి మీద పొంగుతున్న వాగు దాటాల్సిన దయనీయ పరిస్థితి(Miserable condition) ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం రాజులతండాకు చెందిన ఓ నిండు గర్భిణీ ప్రసవ వేదన ఇది.
గ్రామానికి చెందిన సరితకు శనివారం పురిటి నొప్పులు మొదలయ్యాయి. స్థానికుల సాయంతో ఆమెను ఎడ్లబండిలో వాగు దాటించి, అక్కడి నుంచి ఆటోలో నేరడిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చివరకు ఆమెను ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు.