ఆదిలాబాద్ జిల్లా పాలనాధికారి దివ్యదేవరాజన్ ప్రజావేదికలో పాల్గొని రైతుల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని ఇచ్చోడ, సిరికొండ మండలకేంద్రాల్లోని తహశీల్దార్ కార్యాలయాల్లో భూ సమస్యలపై ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా తహశీల్దార్, వీఆర్వోల సమక్షంలో విచారణ జరిపారు. అప్పటికప్పుడు పరిష్కారమవ్వని సమస్యలను వారం రోజుల్లో పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను దివ్యదేవరాజన్ ఆదేశించారు.
భూ సమస్యలపై ప్రజావేదికలో పాల్గొన్న పాలనాధికారి - భూ సమస్యలపపై ప్రజావేదిక
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ, సిరికొండ మండల కేంద్రాల్లోని తహశీల్దార్ కార్యాలయాల్లో భూ సమస్యలపై ప్రజావేదిక నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ దివ్యదేవరాజన్ పాల్గొని రైతుల నుంచి అర్జీలు స్వీకరించారు.
![భూ సమస్యలపై ప్రజావేదికలో పాల్గొన్న పాలనాధికారి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3696288-thumbnail-3x2-vysh.jpg)
భూ సమస్యలపపై ప్రజావేదిక
TAGGED:
భూ సమస్యలపపై ప్రజావేదిక