ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి జనం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తమ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం వివిధ గ్రామాల నుంచి భారీగా తరలివచ్చారు. పాలనాధికారి సంధ్యారాణి, డీఆర్వో నటరాజ్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. భూ సమస్యలు, పింఛన్లు, సదరన్ ధ్రువపత్రాలకు సంబంధించిన సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించుకున్నారు.
కలెక్టరేట్లో ప్రజావాణికి పోటెత్తిన జనం - prajavani program in adilabad collectorate
ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జనం పోటెత్తారు. తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి కలెక్టర్ సంధ్యారాణికి మొరపెట్టుకున్నారు.
![కలెక్టరేట్లో ప్రజావాణికి పోటెత్తిన జనం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3844090-thumbnail-3x2-grivens.jpg)
ప్రజావాణికి పోటెత్తిన జనం