కొవిడ్ దృష్ట్యా ఆదిలాబాద్ జిల్లాలో పాలిసెట్ ప్రవేశ పరీక్షకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలో 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. గంట ముందు నుంచే విద్యార్థులను లోపలికి అనుమతించారు. మాస్క్ పెట్టుకొని వచ్చిన వారినే పరీక్షా కేంద్రంలోకి రానిచ్చారు.
థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే పరీక్షకు అనుమతి - ఆదిలాబాద్లో పాలిసెట్ పరీక్ష కేంద్రాలు
కరోనా జాగ్రత్తల నడుమ పాలిసెట్ ప్రవేశ పరీక్ష జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలోని 4 పరీక్షా కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి విద్యార్థులను గంట ముందే పరీక్ష కేంద్రంలోని అనుమతించారు.
థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే పరీక్షకు అనుమతి
విద్యార్థులకు శానిటైజ్ చేసి, థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే వారిని లోపలికి పంపించారు. పరీక్ష గదుల్లోనూ భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు.
ఇదీ చూడండి:మరోమారు భూముల క్రమబద్ధీకరణకు అవకాశం
TAGGED:
ఆదిలాబాద్ జిల్లా తాజా వార్త