ఆదిలాబాద్‌లో పుర ఎన్నికల ప్రచారానికి రెండు రోజులే గడువు మిగిలి ఉండటం వల్ల అభ్యర్థులు వచ్చిన అవకాశాలను వినియోగింటుకుంటున్నారు. శుక్రవారం సందర్భంగా మసీదుల వద్ద ప్రార్థనలు నిర్వహించుకుని బయటకు వచ్చిన ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని తమకు మద్దతివ్వాలని అభ్యర్థించారు. ఆయా మసీదుల వద్ద రాజకీయ నాయకుల సందడి నెలకొంది. తెరాస, కాంగ్రెస్ నాయకులు... మసీదుల ముందు వరుసకట్టి పరోక్ష ప్రచారం నిర్వహించారు.
మసీదుల ముంగిట రాజకీయ నాయకుల ప్రచారం - మసీదుల ముంగిట రాజకీయ నాయకుల ప్రచారం
ఆదిలాబాద్ జిల్లాలోని పలు మసీదుల వద్ద రాజకీయ ప్రచారం చేపట్టారు. ఎన్నికల ప్రచార పర్వానికి మరో రెండు రోజులే గడువు ఉండటం వల్ల అభ్యర్థులు, పార్టీల నేతలు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు.
మసీదు వద్ద పలు రాజకీయ పార్టీల ప్రచార పర్వం