ఆదిలాబాద్‌లోని తాటిగూడలో జిల్లా అధ్యక్షులు ఫారూఖ్ అహ్మద్ జరిపిన కాల్పుల్లో గాయపడి హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్సపొందుతూ.. మరణించిన సయ్యద్ జమీర్ అంత్యక్రియలు ఆదిలాబాద్‌లో పోలీసు బందోబస్తు మధ్య పూర్తయ్యాయి.
ఈ నెల 18న ఆదిలాబాద్‌లోని తాటిగూడలో జరిగిన కాల్పుల్లో సయ్యద్ జమీర్‌తోపాటు.. ఆయన అన్నకొడుకు మొతేసీన్‌కు బుల్లెట్ గాయాలు కాగా... మన్నాన్‌కు తల్వార్ గాయాలయ్యాయి. అదేరోజు వారికి ఆదిలాబాద్ రిమ్స్‌లో ప్రాథమిక చికిత్స చేసి.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. మొతేసీన్, మన్నాన్ ఆరోగ్యం మెరుగుపడగా.. సయ్యద్ జమీర్ మృతి చెందడం తాటిగూడలో విషాదం అలముకుంది.