కొవిడ్ రెండో దశ విజృంభిస్తోన్న దృష్ట్యా.. రాష్ట్ర సరిహద్దుల్లో చేపట్టిన తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. మహారాష్ట్ర నుంచి వచ్చే కరోనా రోగులను తెలంగాణలోకి రాకుండా బెల్ తారోడా వద్ద కొవిడ్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. రెవెన్యూ, వైద్య సిబ్బంది, పోలీసు అధికారులు.. ప్రజలకు థర్మల్ స్కానింగ్ చేస్తూ అనుమతులిస్తున్నారు.
రాష్ట్ర సరిహద్దుల్లో ముమ్మరంగా తనిఖీలు - మహారాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలు
కరోనా నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చే వాహనాలను అధికారులు ఆపి వేస్తున్నారు.
covid check post
గత 3 రోజుల నుంచి వైద్య సిబ్బంది రాకపోవడంతో, రెవెన్యూ సిబ్బంది, పోలీసులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బంది లేక తమపై పని భారం పెరిగిందంటున్నారు మిగతా అధికారులు. వెంటనే వైద్యాధికారులు విధుల్లో చేరాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:ఆదర్శ మహిళ- 3వేల కొవిడ్ శవాలకు అంత్యక్రియలు