అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ఏబీవీపీ కార్యకర్తలపై దాడి చేసిన ఏసీపీ గంగిరెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఆదిలాబాద్ భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ డిమాండ్ చేశారు.
'శాంతియుతంగా ఆందోళన చేస్తే దాడులు చేస్తారా..! ' - ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసుల దాడులు
అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ఏబీవీపీ కార్యకర్తలపై ఏసీపీ గంగిరెడ్డి దాడి చేసిన ఘటనను ఆదిలాబాద్ భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఖండించారు. తక్షణమే ఏసీపీని సస్పెండ్ చేయాలని కోరారు.
'జంతువుల మాదిరి పోలీసుల దాడులు'
పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు చెల్లించాలని శాంతియుత ఆందోళనకు దిగితే పోలీసులు విచక్షణారహితంగా దాడులు చేశారన్నారు. జంతువుల మాదిరి పోలీసులు తీవ్రంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు వేణుగోపాల్, ఆదినాథ్, రవి, పట్టణ అధ్యక్షులు ఆకుల ప్రవీణ్ ఆయా వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :చిలాటుగూడలో పులి జాడలు... భయాందోళనలో స్థానికులు