Polala Festival Celebrations in Adilabad 2023 రైతులకు చేదోడుగా నిలిచే నందీశ్వరులకు.. ఆ రోజునా ప్రత్యేక పూజలు Polala Amavasya Festival in Adilabad 2023 : రైతంటేనే రాజు, ఆ రాజుకు నిత్యం తోడుగా నిలిచేవి నందీశ్వరులు. పొలానికి వెళ్లేటప్పుడు ఈ బసవన్నలను ఆప్యాయంగా చూస్తూ.. వ్యవసాయంలో తమకు నిత్యం తోడుగా ఉండే ఎద్దులను.. రైతులు దైవంగా భావిస్తారు. ట్రాక్టర్లు మొదలగు సౌకర్యాలు వస్తున్న రైతన్నలు మాత్రం పొలం దున్నడానికి ఎద్దులను ఉపయోగిస్తున్నారు. దసరా, దీపావళి, బతుకమ్మ కంటే ఘనంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎద్దుల కోసం ప్రత్యేకంగా ఓ పండగ జరుపుకుంటారు.దాన్నే పొలాల పండగ అంటారు.
పొలాల అమావాస్య పండుగకు ముస్తాబవుతున్న అడవుల జిల్లా
Polala Amavasya in Adilabad 2023 :ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పొలాల అమావాస్య రాకతో పొలం పనులు దాదాపుగా తగ్గుముఖం పడతాయి. ఏడాదంత కష్టపడిన బసవన్నలని.. పండగకు ఒకరోజు ముందు శుభ్రంగా కడిగి... పసుపురాసి.. శరీరంపై దుస్తులు వేసి నందీశ్వరులుగా అందంగా అలంకరిస్తారు. వాటిని గ్రామదేవతలు, హన్మాన్ ఆలయం చుట్టుతిప్పి గ్రామంలో ఓ చోటకు చేర్చి గ్రామపెద్దలతో పూజలు చేయిస్తారు.
"ప్రతి పొలాల అమావాస్య రోజు ఆ భగవంతుడే సాక్ష్యాత్తు ఎద్దులను చూడటానికి వస్తాడని నమ్మకం. అందుకే మేము అమావాస్య రోజు ఎద్దులను ముస్తాబు చేసి పండుగ జరుపుకుంటాము. పొలం పనుల్లో అది సాయం చేస్తుంది కాబట్టి కుటుంబ సభ్యులందరం కలిసి దాన్ని పూజించి నైవేద్యాలు పెట్టి పండగను చేసుకుంటాం. ఏడాది అంతా మంచి జరగాలని ఆ దేవుణ్ని ప్రార్ధిస్తాం." - గ్రామస్థులు
రైతు జీవితంలో ఎద్దు పాత్ర వీడదీయలేనిది:భూతల్లినే సర్వస్వంగా భావించే రైతుల... దైనందిన జీవితంలోఎద్దుల పాత్ర విడదీయలేనిది. వ్యవసాయంలో సాంకేతికంగా విప్లవాత్మక మార్పులు వచ్చినపన్పటికీ.. ఎద్దుల పాత్ర ఏమాత్రం తగ్గడంలేదు. అందుకే ఎద్దులంటే శివపార్వతుల పుత్రులైన నందీశ్వరులుగా.. భావించే సంప్రదాయం కొనసాగుతోంది. ఏడాదంతా తనతోపాటు కష్టపడే ఎద్దులను పూజించి ఆరాదించే వేడుకే.. పొలాల పండగ. ప్రతి ఏటా శ్రావణ అమావాస్య రోజున వచ్చే ఈ పొలాల పండగ కోసం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అందరూ జరుపుకుంటారు.
ఏరువాక పున్నమిలో దుక్కి దున్నిన మంత్రి జగదీశ్‌రెడ్డి
పొలాల పండగ అంతా బసవన్నల పూజలే కేంద్ర బిందువుగా సాగుతుంది. నందీశ్వరులైన తమ బిడ్డలను చూపించాలని.. పార్వతీదేవి ఏడాదిగా కోరుకుంటే.. శివుడు శ్రావణ అమావాస్య రోజు.. శివుడు ఎద్దులను చూపిస్తాడనేది రైతుల విశ్వాసం. అందుకే ఈరోజు నందీశ్వరుడిగా ఉండే ఎద్దులను చూసి పార్వతీదేవీ మురిసిపోతుంది. పొలాల పండగను ఎంత ఘనంగా జరుపుకుంటే అంత మంచి జరుగుతుందనేది రైతులు నమ్మకం. వృత్తిరీత్యా ఎక్కెడ ఉన్నా.. తప్పనిసరిగా ఈ పండగకి ఇంటికి రావడం గ్రామస్థులకు ఆనవాయితీగా వస్తోంది. ఊళ్లన్నీ పండగ సంబరంతో శోభిల్లుతాయి. ఈ పొలాల అమావాస్య నిర్వహణతో శ్రావణమాసం ముగుస్తుంది.
సూర్యాపేటలో నేత్రపర్వంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు
మేళ్లచెరువులో ఘనంగా ఏరువాక పౌర్ణమి