తెలంగాణ

telangana

ETV Bharat / state

అమ్మ ప్రేమకు సరిలేదమ్మా .. - mothers story

ఈ ప్రపంచంలో స్వచ్ఛమైన ప్రేమ ఏదైన ఉందంటే... అది ఒక్క అమ్మ ప్రేమే. తాను కొవ్వత్తిలా కరిగిపోతూ... పిల్లలకు వెలుగునిస్తోంది. పిల్లలు ఎలా ఉన్నా... ఎటువంటి వారైనా... మీ మంచినే కొరుకునే అమ్మ ప్రేమకు ఎల్లలు ఉండవు. అమ్మ ప్రేమకు సరిలేరు అనడానికి ఈ ఒక్కచిత్రం చాలు.

picture-of-mother-showing-love-in-narnaur-adilabad-district
అమ్మ ప్రేమకు సరిలేదమ్మా ..

By

Published : May 21, 2020, 8:05 AM IST

ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ ప్రాంతానికి చెందిన ఆత్రం జాలీంసాబ్‌ను నాలుగు రోజుల క్రితం ఎద్దు కడుపులో పొడిచింది. బంధువైన ఓ యువకుడి సాయంతో తల్లి సోలాబాయి బుధవారం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి కొడుకును తీసుకొచ్చింది. వైద్యులు పరీక్షించి మందులిచ్చారు. లేవలేని స్థితిలో ఉన్న కుమారుడిని తల్లి ఆసుపత్రి గేటు పక్కనే నేలపై పడుకోబెట్టింది. అతనిపై ఎండ పడకుండా గేటుకు దుప్పటి కట్టి.. ఒక కొనను చేత్తో పట్టుకుంది. తల్లి ప్రేమకు ఎలా ఉంటుందో చూపించింది.

ABOUT THE AUTHOR

...view details