ఆదిలాబాద్ జిల్లాలో రేషన్ లబ్దిదారులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత రెండు రోజులుగా కలెక్టరేట్ సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రం వద్ద సెల్‌నెంబర్ అనుసంధానం కోసం పడిగాపులు కాస్తున్నారు. వేకువజాము నుంచి ఆధార్ కేంద్రాలకు బారులు తీస్తున్నారు. ఆధార్ నమోదు కేంద్రాలు పరిమిత సంఖ్యలో ఉండడం, కార్డుదారులు వేల సంఖ్యలో ఉండడం వల్ల కార్డుదారులకు ఇక్కట్లు తప్పడం లేదు.
ఆధార్ కేంద్రాలకు పరుగు...
ఆదిలాబాద్ జిల్లాలో 355 రేషన్ దుకాణాలున్నాయి. వీటి పరిధిలో లక్షా 88 వేల 549 రేషన్ కార్డుదారులు ఉన్నారు. ఇందులో 94 వేల 274 మంది కార్డుదారులు మాత్రమే ఆధార్‌కు చరవాణి అనుసంధానమై ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. సగం మందికి సెల్‌నెంబర్ అనుసంధానం లేకపోవడం వల్ల వారంతా ఆధార్ నమోదు కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు.