తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా భయం లేదు.. మాస్క్​లు లేకుండా శుభకార్యాలకు - people are traveling without covid precautions

ఓ వైపు కరోనా విజృంభణ ప్రారంభమై భయాందోళనకు గురి చేస్తుంటే... మరోవైపు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా ప్రయాణాలు చేస్తున్నారు. ఈ తీరు పలువురిని కలవరపెడుతోంది.

traveling without covid  fear
ఆదిలాబాద్, మాస్క్​లు లేకుండా శుభకార్యాలకు

By

Published : Mar 25, 2021, 6:58 PM IST

కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాలయాలకు సెలవులు ప్రకటించారు. ఆదిలాబాద్​ను ఆనుకుని ఉన్న మహరాష్ట్రలో అత్యధిక కేసులు నమోదవుతుండగా.. జిల్లాలోనూ రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కానీ ప్రజలు మాత్రం ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా ప్రయాణాలు చేస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో ఎలాంటి కరోనా జాగ్రత్తలు పాటించకుండా.. ప్రయాణికులు శుభకార్యాలకు హాజరవుతున్నారు. ఇక్కడి ప్రజలు మహారాష్ట్రతో ఎక్కువ సత్సంబంధాలు సాగిస్తున్నారు. ఇచ్చోడ వైపు వెళ్తున్న ఓ ఐచర్ వాహనంలో దాదాపుగా 80 మందికి పైగా శుభకార్యాలకు వెళ్తున్నారు. వీరిలో ఏ ఒక్కరికి మాస్క్ లేకపోవడం భయాందోళనకు గురి చేస్తోంది. రానున్న రోజుల్లో ఎక్కువ తీవ్రత ఉండటంతో అధికారులు వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

ఇదీ చదవండి:మన సీఎం... పీఎం అయితే భారతదేశం మారిపోతుంది: మల్లారెడ్డి

ABOUT THE AUTHOR

...view details