ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలోని జామిడి గ్రామస్థులు.. కొవిడ్‌పై యుద్ధానికి సిద్ధమంటున్నారు. పకడ్భందీగా నిబంధనలు పాటిస్తూ ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. గడప దాటే సమయంలో పెట్టుకున్న మాస్క్.. మళ్లీ ఇళ్లు చేరేవరకు తీయడం లేదు. పూట గడవడానికి పని.. బతుకు నిలబడటానికి మాస్క్.. తప్పనిసరి అనుకుంటున్న వీరి దృక్పథం నిజంగా స్ఫూర్తిదాయకం!
పట్టణాల్లో నిర్లక్ష్యం.. పల్లెల్లో వివేకం
పట్టణాలు, పల్లెలు అన్న తేడా లేకుండా కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. జనసంచారం అధికంగా ఉండే సిటీలలో జనాలు కొవిడ్ నిబంధనలను గాలికొదిలేస్తుంటే.. పల్లెల్లో మాత్రం మాస్క్‌లు ధరిస్తూ తామే బెటర్ అని నిరూపిస్తున్నారు ఓ గ్రామ ప్రజలు. భౌతికదూరం పాటిస్తూ ఉపాధి పనులకు వెళ్తోన్న ఆదిలాబాద్ జిల్లాలోని జామిడి గ్రామస్థులను ఇప్పుడందరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరముంది.
పల్లెల్లో కొవిడ్ నిబంధనలు