ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో శనగ రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఎకరానికి 6.20 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలుచేయటంతో ఆందోళన చేపట్టారు. 10 క్వింటాళ్ల దిగుబడిలో.. తక్కువ కొనుగోలు చేస్తే మిగిలినవి ఎక్కడ విక్రయించాలని అధికారులను ప్రశ్నించారు.
వ్యవసాయ మార్కెట్ యార్డులో శనగ రైతుల ఆందోళన
ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో శనగ రైతులు ఆందోళన చేపట్టారు. ఎకరాకు 6.20 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. మిగిలినవి ఎక్కడ విక్రయించాలని అధికారులను ప్రశ్నించారు.
వ్యవసాయ మార్కెట్ యార్డులో శనగ రైతుల ఆందోళన
గతంలో మాదిరి కొనుగోలు చేస్తే తమకు లాభం ఉంటుందని రైతులు పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో నిర్ణీత క్వింటాళ్లు కొంటున్నామని మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పటంతో ఆందోళన విరమించారు.
ఇదీ చూడండి:పంచాయతీ భవనం ముందు సర్పంచ్ ఆత్మహత్యాయత్నం