Owner Locked Government School: ఆదిలాబాద్ గ్రామీణ మండలం బట్టిసావర్గాం పంచాయతీ పరిధిలోని దుబ్బగూడలో గత కొన్నేళ్లుగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నడుస్తోంది. పక్కా భవనం లేని కారణంగా అద్దె తీసుకుని బోధన సాగిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న బడిని ఖాళీ చేయాలని యజమాని రెండు గదుల్లో ఓ గదికి తాళం వేసి వేరో చోటుకి తరలిపోవాలని పురమాయించాడు.
సర్కారు వారి బడికి తాళం.. అసలేం జరిగింది? - అద్దెకు ఉంటున్న పాఠశాలకు తాళం వేసిన యజమాని
Owner Locked Government School: అద్దె చెల్లించలేదని, కొత్త భవనం నిర్మించుకుంటానని యజమాని తేల్చిచెప్పి సర్కారు బడికి తాళం వేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆరుబయట బోధనతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారంటూ తల్లిదండ్రులు కలెక్టరేట్‌కు తరలిరావడంతో వారి సమస్య వెలుగులోకి వచ్చింది.

సర్కారు బడికి తాళం
ఇప్పటికిప్పుడు ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులు తమ పిల్లలను వెంటేసుకుని ప్రజావాణి విభాగాన్ని ఆశ్రయించారు. కలెక్టర్‌కు సమస్యను విన్నవించారు. తమకు కొత్త భవనం మంజూరుచేయాలని కోరారు. ఇదేవిషయమై ఈటీవీ బృందం క్షేత్రస్థాయికి వెళ్లి చూడగా విద్యార్థులు ఆరుబయట పాఠాలు వింటున్న దృశ్యాలు కనిపించాయి. ఎంఈవో జయశీల విద్యార్థులు సమీపంలోని బట్టిసావర్గాం ప్రాథమికోన్నత పాఠశాలకు తరలిస్తామని చెప్పారు. తల్లిదండ్రులు, పిల్లలు తమ గోడును వివరించారు.
ఇవీ చదవండి: