ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో గడువు తీరిన ఇంజెక్షన్లు ఇస్తున్నారని రోగులు, వారి బంధువులు ఆందోళనకు దిగడం కలకలం రేపింది. ఆసుపత్రి మూడో అంతస్తులోని పురుషుల వార్డులో రోగులకు రోజూ మాదిరి యాంటీబాడీ ఇంజెక్షన్లు ఇచ్చేందుకు ఆరోగ్య సిబ్బంది రాగా.. రోగుల్లో ఒకరు ఇంజెక్షన్‌ను పరిశీలించారు. దీంతో గడువు ముగిసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇదేంటని ప్రశ్నించే క్రమంలో సిబ్బంది ఆ ఇంజెక్షన్లు తీసుకున్నారని రోగులు ఆరోపించారు.
రిమ్స్ ఆసుపత్రిలో కాలం చెల్లిన ఇంజెక్షన్ల కలకలం - Adilabad district latest news
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో కాలం చెల్లిన ఇంజెక్షన్లు కలకలం రేపాయి. యాంటీబాడీ ఇంజెక్షన్లు గడువు ముగిసినవి ఇస్తుండటంతో రోగులు, వారి బంధువులు ఆందోళనకు దిగారు. ప్రాణాలు కాపాడమని వస్తే చంపుతారా అంటూ అసహనం వ్యక్తం చేశారు.

రిమ్స్ ఆసుపత్రిలో కాలం చెల్లిన ఇంజెక్షన్ల కలకలం
విషయం తెలుసుకున్న ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత రిమ్స్ ఆసుపత్రికి చేరుకుని ఆరా తీశారు. గడువు ముగిసిన ఇంజెక్షన్లు ఎలా ఇస్తారంటూ మండిపడ్డారు. ప్రాణాలు కాపాడమని వస్తే.. కాలం చెల్లిన ఇంజెక్షన్లు ఇచ్చి చంపుతారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.