ఆదిలాబాద్ జిల్లా బజార్హట్నూర్ మండలం కాండ్లీకి చెందిన సంగీతకు నెరడిగొండ మండలం సవర్గంకు చెందిన విజయ్‌తో 7 నెలల క్రితం వివాహం జరిగింది. శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో నెరడిగొండలోని సవర్గమ్లోని ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న మహిళ కుటుంబ సభ్యులు, బంధువులు నెరడిగొండ పోలీసు స్టేషన్ ముందు జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు.
DHARNA ON HIGHWAY: జాతీయ రహదారిపై వివాహిత కుటుంబ సభ్యుల ధర్నా - తెలంగాణ వార్తలు
పెళ్లై 7 నెలలే అవుతుంది... అన్యోన్యంగా జీవిస్తున్నారు అని అనుకున్నారు. కాని ఏమి జరిగిందో తెలియదు...ఆ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇది ఆత్మహత్య కాదు ఆమె భర్త తరపువారు హత్య చేశారంటూ ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు.. ఆదిలాబాద్ జిల్లా బజార్హట్నూర్ మండలం కాండ్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
జాతీయ రహదారిపై వివాహిత కుటుంబ సభ్యుల ధర్నా
దాదాపు అరగంట సేపు ధర్నా చేసిన మహిళ కుటుంబ సభ్యులు.. పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు. వీరి ఆందోళనతో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
ఇదీ చదవండి:ఎస్బీఐ బ్యాంక్‌లో అగ్ని ప్రమాదం.. కంప్యూటర్లు, దస్త్రాలు దగ్ధం