తెలంగాణ

telangana

ETV Bharat / state

మా కుమార్తె పెళ్లి.. ఇంటి నుంచే దీవించండి..! - ఆదిలాబాద్ పెళ్లి విందు సరకుల పంపిణీ

లాక్ డౌన్.. మానవ జీవన శైలిని మార్చేసింది. విందు భోజనాలు, హంగు ఆర్భాటాలేకుండానే వివాహాలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని గొల్లఘట్ తాంసి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కుమార్తె వివాహానికి అతిధులను ఆహ్వానించలేదు. తమ కుమార్తెను ఇంటి నుంచే దీవించాలని కోరుతూ ప్రతి ఇంటికి విందు సరకులను అందజేశారు.

Our daughter's wedding .. Bless from home ..!
మా కుమార్తె పెళ్లి.. ఇంటి నుంచే దీవించండి..!

By

Published : May 14, 2020, 9:02 AM IST

పెళ్లంటే పందిళ్లు, సందళ్లు, తలంబ్రాలు... విందు భోజనాలు... హంగు ఆర్భాటాలు.. పది కాలాలపాటప గుర్తుండేలా చేసుకుంటారు. కానీ లాక్ డౌన్ నేపథ్యంలో అవి కనిపించ కుండా పోతున్నాయి.

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని గొల్లఘట్ తాంసి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బేబీ తాయి-రవీందర్ దంపతుల కుమార్తె వివాహం గురువారం ఉదయం నిచ్ఛయించగా.... పెళ్లికి అతిధులను ఆహ్వానించలేదు. తమ కుమార్తె సుజాతను ఇంటి నుంచే దీవించాలని కోరుతూ గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి పెళ్లి విందుకు సంబంధించిన సరుకులను అందజేశారు.

ఇదీ చూడండి:థర్మల్‌ వెలుగుల్లో తెలంగాణ నంబర్ వన్

ABOUT THE AUTHOR

...view details