నూతన వ్యవసాయ చట్టాల రద్దు, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఆదిలాబాద్ జిల్లాలో విపక్ష పార్టీలు చేపట్టిన భారత్ బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. పట్టణంలో ఆయాపార్టీల నాయకులు వాహనాలపై తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.
ఆదిలాబాద్‌లో భారత్ బంద్ పాక్షికం
ఆదిలాబాద్ జిల్లాలో భారత్ బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, తెదేపా, వామపక్షపార్టీల నాయకులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో భారత్ బంద్
జిల్లాలో పలు చోట్ల తెరిచి ఉన్నదుకాణాలు మూసివేయించారు. బస్సులు, ఇతర రవాణ వాహన సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఈ బంద్‌లో కాంగ్రెస్, తెదేపా, వామపక్షపార్టీల నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:రైలు పట్టాలపై రైతుల అర్ధనగ్న నిరసన