టేకం జంగుబాయి అనే మహిళకి పురిటినొప్పులు రావడం వల్ల అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. చిన్నుగూడ గ్రామానికి వెళ్లాలంటే వాగు దాటాల్సి ఉంటుంది. ఏం చేయాలో పాలుపోని అంబులెన్స్ సిబ్బంది గ్రామానికి వెళ్లి మహిళను అరకిలోమీటరు వరకు మంచంపై మోసుకొచ్చారు. 108 వాహనంలోకి ఎక్కించి ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అంతలోనే మహిళ పండంటి మగబిడ్డను ప్రసవించింది. అనంతరం ఉట్నూరు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు.
అరకిలోమీటరు మోసి.. అంబులెన్స్‌లో ప్రసవం - AMBULANCE
ఆధునిక కాలంలోనూ కనీస రవాణా సౌకర్యాలు లేక పల్లె జనాలు అవస్థలు పడుతున్నారు. నేటికీ అడవుల జిల్లా ఆదిలాబాద్‌లో అంబులెన్స్ పోలేని పల్లెటూళ్లు ఉన్నాయి. పురిటినొప్పులతో ఉన్న మహిళను 108 సిబ్బంది అరకిలోమీటరు వరకు మంచంపై మోసుకొచ్చారంటే మన అభివృద్ధి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అరకిలోమీటరు మోసి.. అంబులెన్స్‌లో ప్రసవం
Last Updated : Mar 28, 2019, 11:28 AM IST