ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కలెక్టర్ దివ్య దేవరాజన్ సమక్షంలో మద్యం దుకాణాల లైసెన్సుదారుల ఎంపిక జరిగింది. ఎంపిక ప్రక్రియలో తారాబాయి అనే వృద్ధురాలు పాల్గొనడం ఆసక్తిని రేకెత్తించింది. సదరు వృద్ధురాలు పేరిట.. ఆమె మనవడు తమ గ్రామంలోని 12వ నెంబర్ మద్యం దుకాణానికి దరఖాస్తు చేసుకున్నారు. సంబంధిత మద్యం దుకాణానికి 16 మంది పోటీపడగా అందులో మహిళగా వృద్ధురాలు ఒక్కరే ఉండటం విశేషం. డ్రాలో దుకాణం వేరొకరికి దక్కడం వల్ల మనవడితో కలిసి వెనుదిరిగారు.
మద్యం దుకాణం కోసం పండు ముసలమ్మ ఆరాటం - old women participated wines tender in adilabad
కృష్ణ.. రామ అనుకుంటూ గడపాల్సిన ఓ వృద్ధురాలు మద్యం దుకాణం కోసం టెండర్ వేసింది. ఆదిలాబాద్‌లో మద్యం దుకాణాల లైసెన్సు దారుల ఎంపికలో ఆమె పాల్గొనడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
![మద్యం దుకాణం కోసం పండు ముసలమ్మ ఆరాటం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4792740-thumbnail-3x2-tend.jpg)
డ్రా కోసం ఎదురు చూస్తున్న వృద్ధరాలు