తెలంగాణ

telangana

ETV Bharat / state

వేతనాలు చెల్లించాలంటూ రిమ్స్​ ఎదుట నర్సుల ఆందోళన - ఆదిలాబాద్​ రిమ్స్​ ఆసుపత్రి తాజా వార్త

ఆదిలాబాద్​ రిమ్స్​ వైద్యశాల స్టాఫ్​ నర్సులు విధులు బహిష్కరిచి ఆసుపత్రి ఎదుట ఆందోళనను ఉద్ధృతం చేశారు. పెండింగ్​లో ఉన్న తమ ఆరునెలల వేతనాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.

nurses protest in front of adilabad rims hospital
వేతనాలు చెల్లించాలంటూ రిమ్స్​ ఎదుట నర్సుల ఆందోళన

By

Published : Sep 30, 2020, 12:41 PM IST

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు తమ ఆందోళనను ఉద్ధృతం చేశారు. బకాయిపడ్డ ఆరు నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్​ చేస్తూ కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు.

బుధవారం విధులను బహిష్కరించి ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపారు. పెండింగ్​లో ఉన్న జీతాలతో పాటు కొవిడ్ సమయంలో విధులు నిర్వహిస్తోన్న తమకు ప్రత్యేక నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేతన చెల్లింపులో రిమ్స్ డైరెక్టర్ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇదీ చదవండి:తరాలు మారిన తీరని సమస్యలు.. అమలుకు నోచుకోని హామీలు

ABOUT THE AUTHOR

...view details