స్థానిక ఎన్నికల నామినేషన్లకు ముగిసిన గడువు - mpdo
స్థానిక ఎన్నికలకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. నామినేషన్ల గడువు నేటితో ముగుస్తున్న కారణంగా అభ్యర్థులు ఎంపీడీవో కార్యలయాలకు తరలివెళ్లి నామ పత్రాలు సమర్పించారు.
నామపత్రాలు సమర్పించేందుకు అభ్యర్థులు బారులు
ఆదిలాబాద్ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు చివరి రోజున భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. నామపత్రాలు సమర్పించేందుకు అభ్యర్థులు బారులు తీరారు. ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఎంపీడీవో కార్యాలయాల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. తొలివిడతలో 6 జడ్పీటీసీ, 51 ఎంపీటీసీ స్థానాలకు తెరాస, భాజపా, కాంగ్రెస్ పార్టీల నుంచి పోటాపోటీగా నామపత్రాలు దాఖలయ్యాయి.