తెలంగాణ

telangana

ETV Bharat / state

No Funds for Railway Over Bridge in Adilabad : పరిహారం లేదు.. ఉపాధీ పాయే.. ఆందోళనలో రైల్వే ఓవర్​ బ్రిడ్జ్​ నిర్వాసితులు - Rand B Office Speech on Railway Under Bridge

No Funds for Railway Over Bridge in Adilabad : ఆదిలాబాద్‌లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైల్వే ఓవర్‌, అండర్‌ బ్రిడ్జిల నిర్మాణం.. నాన్న పులివచ్చే అనే చందంగా మారింది. దశాబ్ధాల తరబడి ఊరిస్తూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో మళ్లీ తెరపైకి వచ్చింది. పనుల నిర్వహణ ముందుకు సాగడం లేదు. రూ.91 కోట్లకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపినప్పటికీ.. నయాపైసా విడుదల చేయకపోవడంతో పనుల నిర్వహణకు అవరోదంగా మారుతోంది.

Railway Under Bridge Works in Adilabad
No Funds for Railway Over Bridge Peoples

By ETV Bharat Telangana Team

Published : Aug 30, 2023, 9:54 PM IST

No Funds for Railway Over Bridge in Adilabad : ఆదిలాబాద్‌ పట్టణంలో సంజయ్‌నగర్‌ ప్రాంతంలో ఆర్​ఓబీ, తాంసీ బస్టాండ్‌ ప్రాంతంలో అండర్‌ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం రూ.91.20 కోట్లు మంజూరు ఇచ్చింది. ఇందులో రూ.57. 71కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటా కాగా మరో రూ.39.49కోట్లు కేంద్ర ప్రభుత్వ వాట ఉన్నది. గ్రామీణ రహదారులు, భవనాల శాఖ 2022 నవంబర్‌ 24న హైదరాబాద్‌కు చెందిన తనిష్క్‌ సంస్థతో జరిగిన ఒప్పందం ప్రకారం 2024లో పూర్తిచేయాల్సి ఉంది. ఈలోగా నిర్వాసితులకు పరిహారం ఇచ్చి.. పూర్తిస్థాయి పనులు చేపట్టాలనేదానిపై స్పష్టత కొరవడుతోంది.

Compensation not Given Railway Under Bridge in Adilabad : సంజయ్‌నగర్‌, తాంసీ బస్టాండ్‌ ప్రాంతాల్లో నిర్వాసితులవుతున్న ఇళ్లు, దుకాణ సముదాయాలను గుర్తించిన మున్సిపల్‌ యంత్రాంగం తయారుచేసిన నివేదికను ఆర్‌అండ్‌బీకి నివేదించింది. వాటికి రూ.51.25 కోట్ల పరిహారం ఇవ్వాలని తేల్చిన ఆర్‌అండ్‌బీ నివేదిక రెవెన్యూ శాఖకు వెళ్లింది. కానీ ఇంతవరకు నయాపైసా విడుదల కాలేదు. మరోపక్క నిర్వాసితులవుతున్న వ్యక్తులకు డబ్బులు ఇవ్వకుండానే ఇళ్లు, దుకాణాలను ఖాళీ చేయాలని మున్సిపల్‌ యంత్రాంగం ఒత్తిడి చేస్తుండటంతో ఆందోళనకు దారితీస్తోంది. మార్కెట్‌ ధరలకంటే తక్కువ పరిహారం నిర్ణయించడమే కాకుండా.. ప్రకటించిన పరిహారం కోసం నెలలు తరబడిగా తిప్పుకుంటున్నారనిబాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"ఆరు నెలల క్రితం ప్రభుత్వం మాకు నోటీసులు ఇచ్చింది. దానికి మేము సమాధానం ఇచ్చాం. మాకు పరిహారం డబ్బులు పేపర్​ల కింద చూపిస్తున్నారే తప్ప.. ఇప్పటి వరకు ఇవ్వలేదు. వంతెన ఏర్పాటు చేసిన ప్రాంతం అంతా ఖాళీ చేశాం. దానివల్ల మేము ఆదాయం కోల్పాయాం. కార్యాలయాల చుట్టూ తిరుగుతునే ఉన్నాం. కానీ పరిహారం చెల్లించలేదు. మాకు ఇవ్వాల్సిన పరిహారం త్వరగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం."-మహ్మద్‌ అలీ, ఆదిలాబాద్‌

Karimnagar Bridges: శిథిలావస్థకు కల్వర్టులు... ముందకు సాగని పనులు

R&B Office Speech on Railway Under Bridge in Adilabad: ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ, మున్సిపల్‌ శాఖల మధ్య సమన్వయం లేకపోవడమే పనుల నిర్వహణకు అవరోదంగా మారుతోందని స్థానికులు చెబుతున్నారు. శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్నందున రైవ్వే ఓవర్‌/అండర్‌ బ్రిడ్జి(Railway Over Bridge) కోసం నిధులు మంజూరు(No Funds) చేశామని నాయకులు ప్రకటించడం తప్పితే ఏ నిర్వాసితుడికీ నయాపైసా పరిహారం పంపిణీ చేయలేదని పేర్కొన్నారు. బాధితుల గోడును పరిగణలోకి పట్టించుకోని ఆర్‌అండ్‌బీ అధికారులు మాత్రం.. స్థానిక ఎమ్మెల్యే ప్రొత్సహంతో పనులన్నీ సవ్యంగానే సాగుతున్నాయని పేర్కొనడం విస్మయానికి గురి చేస్తోందని అన్నారు. దశాబ్ధాలుగా పట్టించుకోని రైల్వే వంతెనల పనులు పరిహారం ఎన్నికల పుణ్యమా.? అని తెరమీదకు తీసుకు వచ్చారని స్థానికులు తెలిపారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను నిర్వాసితులకు పంపిణీ చేసే ప్రక్రియ చేపడితే మళ్లీ ఎన్నికల వరకు మరుగునపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

"నిర్వాసితుల కోసం రూ.27.17 కోట్లు రెవెన్యూ వారు కేటాయించారు. నిర్వాసితుల ప్రాంతాన్ని మేము సేకరిస్తాం. పరిహారం ఇచ్చేది రెవెన్యూ అధికారులు. బ్రిడ్జ్​ నిర్మాణంలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి."- నర్సయ్య, ఈఈ, ఆర్‌అండ్‌బీ, ఆదిలాబాద్‌

Nizamabad: మాధవనగర్​ రైల్వే ఓవర్​ బ్రిడ్జి పనులు వేగవంతం.. ఇంకా కొన్ని రోజుల్లోనే..!

ట్రాఫిక్‌ నుంచి నగరవాసులకు ఊరట.. అందుబాటులోకి మరో రైల్వే ఓవర్ బ్రిడ్జ్​!

కడుతుండగానే బ్రిడ్జికి పగుళ్లు.. సాధారణమేనని ఎమ్మెల్యే వ్యాఖ్య!

ABOUT THE AUTHOR

...view details