ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలోని గిరిజన గురుకులాల విద్యార్థులు వీరు. మొబైల్ ఫోన్లలో ఆన్‌లైన్ పాఠాలు వినేందుకు ఇలా అవస్థలు పడుతున్నారు. మారుమూల ప్రాంతాల్లో మొబైల్ ఫోన్లకు సిగ్నళ్లు అందకపోవడంతో చెట్లు ఎక్కి సిగ్నళ్లను అందుకుని, పాఠాలు వినే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ గిరిజన గురుకులాల సొసైటీ కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ ఆదివారం ఈ ఫొటోను ట్వీట్ చేశారు.
సిగ్నళ్లు అందక విద్యార్థుల తంటాలు.. - విద్యార్థులకు సిగ్నళ్లు అందక ఆన్‌లైన్ పాఠాలు వినేందుకు అవస్థలు
ప్రభుత్వం ఆన్‌లైన్ క్లాసులను ప్రారంభించింది. అయితే గ్రామీణప్రాంతాల్లోని విద్యార్థులకు సెల్‌ఫోన్ సిగ్నల్స్ అందక.. పాఠాలు వినేందుకు చెట్లు ఎక్కారు. ఆ ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది.
సిగ్నళ్లు అందక విద్యార్థుల తంటాలు..