తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్మల్ జిల్లాలో పలు గ్రామాలు జలదిగ్బంధం...

నిర్మల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద నీరు రావడంతో భైంసా మండలంలో పలు గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి.

By

Published : Aug 3, 2019, 2:17 PM IST

నిర్మల్ జిల్లాలో పలు గ్రామాలు జలదిగ్బంధం...

నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భైంసా మండలం గుండెగాం గ్రామం వద్ద నిర్మిస్తున్న రంగారావు పాల్సికర్ ప్రాజెక్టుకు వరద నీరు రావడం వల్ల గుండెగాం వంతెన వద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పరిస్థితి ఇలానే కొనసాగితే గుండెగాం గ్రామం ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. గత సంవత్సరం ఈ గ్రామం ముంపునకు గురైతే బాధితులకు భైంసాలో పునరావాసం కల్పించారు.

నిర్మల్ జిల్లాలో పలు గ్రామాలు జలదిగ్బంధం...

ABOUT THE AUTHOR

...view details