తెలంగాణ

telangana

ETV Bharat / state

Chanaka-Korata Barrage: చనాకా - కొరాటా ఆనకట్ట నిర్మాణానికి జాతీయ వన్యప్రాణి మండలి ఆమోదం - పెన్​గంగ నదిపై నిర్మించనున్న చనకా కొరాట ఆనకట్ట

చనాకా - కొరాటా ఆనకట్ట(Chanaka-Korata Barrage) నిర్మాణానికి జాతీయ వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది (National Wildlife Board approves to Chanaka-Korata dam). పెన్ గంగ నదిపై (Pen Ganga river) మహారాష్ట్ర - తెలంగాణ సరిహద్దులో నిర్మిస్తోన్న ఆనకట్ట నిర్మాణానికి పర్యావరణ అనుమతులు అవసరం. శుక్రవారం దిల్లీలో జరిగిన జాతీయ వన్యప్రాణి మండలి సమావేశంలో చనాకా - కొరాటా ఆనకట్ట ప్రతిపాదనలపై చర్చించారు.

Chanaka-Korata dam
Chanaka-Korata dam

By

Published : Oct 8, 2021, 10:53 PM IST

చనాకా - కొరాటా ఆనకట్ట నిర్మాణానికి (Chanaka-Korata Barrage) జాతీయ వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది (National Wildlife Board approves to Chanaka-Korata Barrage). పెన్​గంగ నదిపై మహరాష్ట్ర, తెలంగాణ సరిహద్దులో ఈ ఆనకట్ట నిర్మించనున్నారు. దీనికి సమీపంలో తిప్పేశ్వర్ వన్యప్రాణి సంరక్షణా కేంద్రం ఉంది. ఆనకట్ట నిర్మాణం కోసం ఎకో సెన్సిటివ్ జోన్​గా నోటిఫై చేసిన అటవీయేతర ప్రాంతంలో 21 హెక్టార్ల భూమిని వినియోగించుకోవాల్సి ఉంది. దీంతో పాటు మహారాష్ట్ర, తెలంగాణలోని 5000 హెక్టార్ల అటవీయేతర భూమి ముంపునకు గురికానుంది.

శుక్రవారం దిల్లీలో జరిగిన జాతీయ వన్యప్రాణి మండలి సమావేశంలో చనాకా - కొరాటా ఆనకట్ట ప్రతిపాదనలపై చర్చించారు. అటవీప్రాంతంతో సంబంధం లేనందున, వన్యప్రాణి సంరక్షణా కేంద్రానికి దూరంగా ఉన్నందున పర్యావరణ అనుమతుల కోసం సిఫారసు చేయాలని మండలి నిర్ణయించింది. నిర్దిష్ట షరతులతో సిఫారసుకు జాతీయ వన్యప్రాణి మండలి నిర్ణయం తీసుకొంది. వన్యప్రాణి మండలి ఆమోదంతో ఆనకట్టకు పర్యావరణ అనుమతులకు మార్గం సుగమమం కానుంది.

ఇదీ చూడండి:Rain alert: రాగల మూడు గంటల్లో ఆ జిల్లాలకు వర్షసూచన

ABOUT THE AUTHOR

...view details