Nagoba Jatara: ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ వేదికగా వెలిసిన నాగోబా జాతర ఘనంగా జరుగుతోంది. మెస్రం వంశీయుల బతుకులకు ఆలంబన. అరణ్యమే జీవితంగా భావించే ఆదివాసీల బతుకులు.. నాగోబా జాతర సందర్భంగా బాహ్యలోకానికి తెలుస్తోంది. ఏడాది పొడుగున ఎక్కడెక్కడో ఉండే మెస్రం వంశీయులు.. పుష్యమి అమావాస్యలో వచ్చే నాగోబా జాతరలో కలుసుకోవాలనేది ఆదివాసీల ఆచారం.
జాతరలో ఏమి చేస్తారు: అడవిని నమ్మి బతుకు వెల్లదీసే ఆదివాసీలది కల్మషంలేని హృదయం. నాగోబా జాతర సందర్భంగా.. అందరూ ఎడ్లబండ్లపై వచ్చి.. చెట్ల నీడలో సేదతీరుతారు. కుటుంబసభ్యులు బంధువులను కలుసుకొని కష్టసుఖాలు పంచుకుంటారు. అనంతరం అందరూ కలిసి భోజనాలు చేసి.. జాతరకు వెళ్తారు. అక్కడ వ్యవసాయ పనులకు ఉపయోగపడే వస్తువులు గృహోపయోగానికి అవసరమైన సామగ్రిని కొనుగోలు చేస్తారు.