ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో దండారి సంబురాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. గూడాల్లోని ఆదివాసీలు సాంప్రదాయబద్ధంగా వైభవోపేతంగా సంబురాలు నిర్వహించుకుంటున్నారు.
నాగోబా ఆలయంలో ప్రారంభమైన దండారి సంబురాలు - dandari festivities in keslapur
ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో దండారి సంబురాలు ప్రారంభమయ్యాయి. నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సంబురాలను ప్రారంభించారు. దీపావళి వరకు ఈ వేడుకలు జరగనున్నాయి.
నాగోబా ఆలయంలో ప్రారంభమైన దండారి సంబరాలు
ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆదివాసీలు దండారి సంబురాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా గుస్సాడి వేషధారణదారులతో కలిసి వాద్యాలకు అనుగుణంగా దండారి దింసా ఆడిపాడారు. దీపావళి వరకు ఈ సంబురాలు నిర్వహించుకుంటామని ఆదివాసీ పెద్దలు తెలిపారు.
ఇదీ చదవండి:'నిజాంను స్ఫూర్తిగా తీసుకుని పాలన సాగిస్తున్న కేసీఆర్'