తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో న్యాక్ బృందం.. వసతులపై ఆరా - Adilabad District Latest News

ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను న్యాక్ బృందం సందర్శించింది. న్యాక్ ఛైర్మన్ డా.ప్రవీణ్ త్రివేది సారథ్యంలోని బృందానికి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. కళాశాల వసతులపై సభ్యులు ఆరా తీస్తున్నారు.

ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో న్యాక్ బృందం
ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో న్యాక్ బృందం

By

Published : Mar 15, 2021, 7:31 PM IST

ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో.. బెంగుళూరు నుంచి వచ్చిన న్యాక్ బృందం సందర్శించింది. న్యాక్ ఛైర్మన్ డా.ప్రవీణ్ త్రివేది సారథ్యంలోని సభ్యులు ప్రొ. డా.జుగల్ కిషోర్ మిశ్రా, డా.గోపాల్ కల్కోటీకి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.

కళాశాల వసతులపై సభ్యులు ఉదయం ఆరా తీశారు. పూర్వ, ప్రస్తుత విద్యార్థులతో మధ్యాహ్నం సమావేశమయ్యారు. కళాశాలకు మంచి గ్రేడ్ ఇచ్చేలా తమ వంతు ప్రయత్నం చేస్తామని ఛైర్మన్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:మార్చి 22 నుంచి కృత్రిమ మేథపై మరింత శిక్షణ: టీటా డిజిథాన్​

ABOUT THE AUTHOR

...view details