KCR appreciates Mukhara village: రాష్ట్రంలో పల్లెలు ప్రగతిపథంలో సాగుతున్నాయని తెలిపేందుకు ముఖరా-కె గ్రామమే నిదర్శమని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం ఆదిలాబాద్ జిల్లా ముఖరా-కె ను ఆదర్శంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ ఊరిలో సేకరించిన చెత్తను వర్మికంపోస్టు ఎరువుగా మార్చుతున్నారు. అలా ఆదాయం నుంచి లక్ష రుపాయలను ముఖ్యమంత్రి సహాయనిధి ముఖరా-కె గ్రామస్థులు విరాళంగా ఉచ్చారు.
సీఎం కేసీఆర్ నోట ఆ 'పల్లె' ప్రగతి మాట.. భేష్ అంటూ.. - ఆదిలాబాద్ తాజా వార్తలు
KCR appreciates Mukhara village : నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో చెత్త నిర్వహణ అతి ముఖ్యమైనది. అలాంటి కీలక సమస్యకు ముచ్చటైన పరిష్కారం చూపడమే గాక దాంతో డబ్బు సంపాదిస్తోంది తెలంగాణలోని ఓ మారుమూల పల్లె. ఆ పల్లె ఆలోచనను.. ప్రగతి బాటలో ఆ పల్లె వేస్తున్న అడుగులు చూసి సీఎం కేసీఆర్ ఆశ్చర్యపోయారు. ఆ గ్రామాన్ని రాష్ట్రంలోని ప్రతి ఊరు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
Mukhara village
గ్రామంలో సేకరించిన తడిచెత్త ద్వారా వర్మికంపొస్ట్ తయారు చేసి 7లక్షల ఆదాయాన్ని సంపాదించడం అద్భుతమని అభినందించారు. తమకు ఆదాయం వచ్చిన 7 లక్షల్లో ... 4 లక్షల రూపాయలు సొలార్ గ్రిడ్, 2 లక్షలతో డిజిటల్ లైబ్రరి ఏర్పాటు చేసినట్లు ముఖరా సర్పంచ్ మీనాక్షి తెలిపారు. మిగతా లక్ష రూపాయలు సీఎం సహాయనిధికి ఇచ్చినట్లు చెప్పారు.
ఇవీ చదవండి: