తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దున గల పెన్‌గంగా నదిపై నిర్మిస్తున్న ఆదిలాబాద్ జిల్లాలోని చనకా-కోర్ట బ్యారేజీని ఎంపీ సోయం బాపూరావు భాజపా శ్రేణులతో కలిసి సందర్శించారు. అసంపూర్తిగా ఉన్న పనులను చూసి ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు.
చనకా-కోర్ట బ్యారేజీని సందర్శించిన ఎంపీ సోయం - ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు తాజా వార్తలు
ఆదిలాబాద్ జిల్లాలోని చనకా-కోర్ట బ్యారేజీని భాజపా శ్రేణులతో కలిసి ఎంపీ సోయం బాపూరావు సందర్శించారు. ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

చనకా-కోర్ట బ్యారేజీని సందర్శించిన ఎంపీ సోయం
ఈ సందర్భంగా బ్యారేజీ నిర్మాణం విషయమై గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సోయం గుర్తుచేశారు. ఉద్దేశ పూర్వకంగానే ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాపై చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించి.. బ్యారేజీ వనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీచూడండి: 'పీవీ శత జయంతి ఉత్సవాలను పెద్దఎత్తున నిర్వహిస్తాం'