తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్​.ఆర్.​ఆర్ చిత్రాన్ని అడ్డుకుంటాం: సోయం బాపూరావు - ఆర్​.ఆర్​.ఆర్.చిత్రంపై మండిపడ్డ సోయం బాపూరావు వార్తలు

కుమురం భీం పోరాట స్ఫూర్తితో తీస్తున్న ఆర్​.ఆర్​.ఆర్​. సినిమాను అడ్డుకుంటామని ఆదిలాబాద్​ ఎంపీ సోయం బాపూరావు హెచ్చరించారు. చిత్రంలో ఆయన వేషధారణ ఆదివాసీల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని విమర్శించారు.

MP Soyam Bapurao said we will block the R.R.R. film
ఆర్​.ఆర్.​ఆర్ చిత్రాన్ని అడ్డుకుంటాం: సోయం బాపూరావు

By

Published : Oct 27, 2020, 3:26 PM IST

పోరాట యోధులు కుమురం భీం, అల్లూరి సీతారామరాజులపై దర్శకుడు రాజమౌళి తీస్తున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని అడ్డుకుంటామని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం గౌరాపూర్ పంచాయతీ పరిధిలోని చిత్తబట్ట గ్రామంలో నిర్వహించిన కుమురం భీం 80వ వర్ధంతి సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కుమురం భీం నైజాం సర్కారుతో పోరాటం చేసి అమరుడయ్యారని ఎంపీ పేర్కొన్నారు. ఆర్​.ఆర్​.ఆర్​. చిత్రాన్ని ఆయన పోరాట స్ఫూర్తితోనే తీస్తున్నా.. సినిమాలో ఆయన పాత్ర ముస్లింల వేషధారణను పోలి ఉండటం ఆదివాసీల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందని విమర్శించారు. ఈ సందర్భంగా ఆదివాసీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా డిసెంబర్ 9న ఏటూరు నాగారంలో లక్ష మందితో సభ ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:డీజీపీ కార్యాలయం ముట్టడికి బీజేవైఎం యత్నం.. అడ్డుకున్న పోలీసులు

ABOUT THE AUTHOR

...view details