తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతు వేదికలపై తెరాస ఎమ్మెల్యేల ఫొటోలెందుకు?' - mp soyam bapu rao comments on raithu vedika

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం కరంజి టీ గ్రామంలో ఎంపీ సోయం బాపురావు సమక్షంలో పలువురు భాజపాలో చేరారు. రైతు వేదికలపై తెరాస ఎమ్మెల్యేల ఫొటోలు ఎందుకని ఆయన ప్రశ్నించారు.

'రైతు వేదికలపై తెరాస ఎమ్మెల్యేల ఫొటోలెందుకు?'
'రైతు వేదికలపై తెరాస ఎమ్మెల్యేల ఫొటోలెందుకు?'

By

Published : Dec 13, 2020, 5:14 PM IST

రైతు వేదికలపై తెరాస ఎమ్మెల్యేల చిత్రాలు ఉంటే చెరిపివేయాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు భాజపా శ్రేణులకు సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన రైతు వేదికలపై ప్రధాని నరేంద్ర మోదీ చిత్రంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటో ఉంటే అభ్యంతరం లేదన్నారు.

తెరాస ఎమ్మెల్యేల ఫొటోలు రైతు వేదికలపై ఎందుకని ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం కరంజి టీ గ్రామంలో ఎంపీ సమక్షంలో పలువురు భాజపాలో చేరారు.

ఇదీ చూడండి:పోలీసు, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని సీఎం ఆదేశం

ABOUT THE AUTHOR

...view details