కరోనా నియంత్రణలో భాగంగా ఆదిలాబాద్ పట్టణాన్ని పోలీసు యంత్రాంగం తమ ఆధీనంలోకి తీసుకొంది. కేవలం ఎన్టీఆర్ కూడలి నుంచి వెళ్లి.. అదే కూడలి నుంచి బయటకు వచ్చేలా ఏర్పాట్లు చేసింది.
అత్యవసరమయితేనే బయటకు రండి: సోయం బాపురావు - Covid-19 latest news
ఆదిలాబాద్లో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నారు. పరిస్థితులను ఎంపీ సోయం బాపురావు పరిశీలించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని ప్రజలకు ఎంపీ సూచించారు. స్వీయ నిర్బంధంలోనే ఉండాలని కోరారు.
soyam bapurao
క్షేత్రస్థాయి పరిస్థితులను పార్లమెంటు సభ్యుడు సోయం బాపురావు పరిశీలించారు. మరింత సమాచారం ఈటీవీ భారత్ ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో 404కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య