గ్రామాల అభివృద్దికి కేంద్రం ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకే నేరుగా కేటాయిస్తుంటే.. ఆ నిధులను తమ కార్యకర్తలకు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు దుయ్యబట్టారు.
కేంద్ర పంచాయతీ నిధులు.. రైతు వేదికలకు కేటాయింపు - 15th Financial Union provided by the Center
కేంద్రం ఇస్తున్న ఆర్థిక సంఘం నిధులను రైతు వేదికలకు కేటాయిస్తూ పక్కదారి పట్టిస్తోందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ఆదిలాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో ఆయన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

కేంద్ర పంచాయతీ నిధులు.. రైతు వేదికలకు కేటాయింపు
14వ ఆర్థిక సంఘం నిధులతో ట్రాక్టర్ల కొనుగోలు, విద్యుత్ బిల్లులు కట్టించుకున్న ప్రభుత్వం.. ఇపుడు రైతు వేదికల నిర్మాణాలకు 15వ ఆర్థిక సంఘం నిధులు వెచ్చించాలని ఆదేశిస్తూ పంచాయతీల్లో నిధులు లేకుండా చేస్తోందన్నారు.
కేంద్ర పంచాయతీ నిధులు.. రైతు వేదికలకు కేటాయింపు
ఇదీ చూడండి :ఒంటెలను చంపకుండా చర్యలు తీసుకోండి: హైకోర్టు