తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒకటి కాదు రెండు కాదు.. ఒకేసారి నాలుగు పులుల సంచారం...

Wandering of Tigers in Adilabad districtt: భీంపూర్ మండలం తాంసి-కే శివారులోని పిప్పల్‌కోటి రిజర్వాయర్ వద్ద పనులు జరుగుతున్న ప్రదేశంలో నాలుగు పులులు కనిపించాయి. రోడ్డు దాటుతున్న దృశ్యాలను డ్రైవర్ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

wandering of Tigers in Adilabad district
wandering of Tigers in Adilabad district

By

Published : Nov 13, 2022, 1:22 PM IST

ఒకటి కాదు రెండు కాదు.. ఒకేసారి నాలుగు పులుల సంచారం

Wandering of Tigers in Adilabad district: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం కలకలం రేపుతోంది. భీంపూర్ మండలం తాంసి-కే శివారులోని పిప్పల్‌కోటి రిజర్వాయర్ వద్ద పనులు జరుగుతున్న ప్రదేశంలో నాలుగు పులులు కనిపించాయి. రోడ్డు దాటుతున్న దృశ్యాలను డ్రైవర్ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. శనివారం అర్ధరాత్రి పనులు ముగించుకుని క్యాంపు వైపు వెళుతుండగా, వాహనం ముందు నుంచి పులులు ఒకదాని వెంట ఒకటి వెళ్తుండగా చిత్రీకరించడంతో, నాలుగు పులుల సంచారం వెలుగులోకి వచ్చింది.

ఇటీవల జైనథ్ మండలం గూడ గ్రామం శివారులోని చనకాకొరట కెనాల్‌లో కనిపించిన రెండు పులులు.. తాజాగా కనిపించిన వాటిలో ఉన్నాయని అటవీ అధికారులు ధ్రువీకరించారు. కనిపించినవాటిలో ఒక పులి ఉండగా, మిగతా మూడు ఏడాది వయస్సులోపు ఉన్న పిల్లలుగా భావిస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దు తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి వచ్చిన పులి దాని పిల్లలు అవాసం ఏర్పర్చుకునే క్రమంలో నెల రోజులుగా తాంసి కే అటవీ శివారులో మకాం వేసినట్లుగా అనుమానిస్తున్నారు.

రెండే అనుకుంటే నాలుగు పులులు సంచరించడం, ఇప్పుడు వాటి సంరక్షణ అటవీ అధికారులకు సవాలుగా మారగా, జనాల్లో మాత్రం ఏమవుతుందనే భయం క్షణ క్షణం వెంటాడుతోంది. ఇప్పటికే అటవీ అధికారులు బేస్ క్యాంపు ఏర్పాటు చేసుకొని పులుల కదలికలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details