మహారాష్ట్రలో కరోనా తీవ్రత పెరుగుతుండడం వల్ల తెలంగాణ సరిహద్దు జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దున ఉన్న పెన్‌గంగ సమీపంలోని డొల్లార గ్రామం వద్ద శాశ్వత నిర్మాణం ఏర్పాటు చేసింది. వైద్యారోగ్యశాఖ, పోలీసు, రెవెన్యూ, ఆర్టీఏ, జిల్లా పరిషత్ , పంచాయతీ విభాగాల్లోని దాదాపుగా 50 మంది ఉద్యోగులతో ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం ఈటీవీ భారత్ ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు.
మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దులో కట్టుదిట్టం - ఆదిలాబాద్ జిల్లా తాజా వార్తలు
రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. లాక్డౌన్ నిబంధనలు సడలించినప్పటి నుంచి సరిహద్దు ప్రాంతాల్లో శాశ్వత క్యాంపులు ఏర్పాటు చేసి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాతే అనుమతిస్తున్నారు. మహారాష్ట్ర- ఆదిలాబాద్ సరిహద్దులో దాదాపు 50 మందితో షిప్టుల వారీగా తనిఖీలు చేస్తున్నారు.
మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దులో కట్టుదిట్టం