ఆదిలాబాద్‌లో కరోనా కట్టడిలో భాగంగా అధికార యంత్రాంగం సంచార ఏటీఎం వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ గ్రామీణ బ్యాంకు సహకారంతో ఈ వాహనాన్ని ఏర్పాటు చేసింది. సంచార ఏటీఎం ఏర్పాటుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంచార ఏటీఎం నుంచి... ఖాతాదారులు ఏ బ్యాంకు వారైనప్పటికీ డబ్బులు డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. దీనిపై మరింత సమాచారం ఈటీవీ భారత్ ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు.
ఆదిలాబాద్‌లో సంచార ఏటీఎం సేవలు - Corona Lock down Adilabad
కరోనా వ్యాప్తి నివారణకు ఆదిలాబాద్ జిల్లా యంత్రాగం ప్రయోగాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. డబ్బుల కోసం బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చర్యలు చేపట్టింది. సంచార ఏటీఎం వాహనాన్ని ఏర్పాటు చేసింది. కాలనీల్లోనే డబ్బులను డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది.

సంచార ఏటీఎం