రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అహర్నిషలు కృషి చేస్తోందని ఎమ్మెల్యే అజ్మీర రేఖా నాయక్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని పులిమడుగు, కామాయిపేట్, లక్షేట్టిపేట్, భీమ్ గూడా ప్రాంతాల్లో స్థానిక ఎంపీపీ జయవంత రావుతో కలిసి పలు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.
'రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అహర్నిషలు కృషి' - utnoor latest news
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే అజ్మీర రేఖా నాయక్ పర్యటించారు. స్థానిక ఎంపీపీ జయవంతరావుతో కలిసి పలు నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఆయా ప్రాంతాల ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

mla rekha nayak visited in utnoor mandal
రైతులు నీటిని కాపాడుకోవడానికి ప్రవహించే వాగులపై చెక్ డ్యాం నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. భూగర్భ జలాలు అడుగంటి పోకుండా ఉంటాయని... వీటితో రైతులకు ఎంతో మేలని సూచించారు. అనంతరం ఆయా ప్రాంతాల ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలున్నా... వెంటనే తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.