నూతన వ్యవసాయ విధానంతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం సాలెవాడను సందర్శించారు. నియంత్రిత సాగుపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. భూసార పరీక్షల ఆధారంగా పంటలు సాగు చేసి అభివృద్ధి సాధించాలని సూచించారు.
'రైతు బంధుపై ఎవ్వరికీ అపోహలు వద్దు' - 'రైతు బంధుపై ఎవ్వరికీ అపోహలు వద్దు'
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం సాలెవాడలో ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ పర్యటించారు. నియంత్రిత సాగుపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొని... రైతులకు పలు సూచనలు చేశారు.
'రైతు బంధుపై ఎవ్వరికీ అపోహలు వద్దు'
వర్షాకాలంలో రైతులు మొక్కజొన్న పంట వేయకుండా... నూనెగింజల పంటలు వేస్తే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. పంటలు పండించే సమయంలో ఏమైనా సమస్యలుంటే వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. అందరికీ రైతు బంధు పథకం అందుతుందని అపోహలు పెట్టుకోవద్దని పేర్కొన్నారు.