ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ బానోత్ బలరాంపై ఎమ్మెల్యే జోగు రామన్న మండిపడ్డారు. తీరు మార్చుకోకపోతే సహించేది లేదని హెచ్చరించారు. ఆదిలాబాద్ పట్టణం మసూద్‌చౌక్‌లో బెస్ట్ ఫ్రెండ్ వెల్ఫేర్ సోసైటీ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రిమ్స్ డైరెక్టర్‌పై ఎమ్మెల్యే రామన్న ఆగ్రహం - రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జోగు రామన్న
రిమ్స్ డైరెక్టర్‌పై ఎమ్మెల్యే జోగు రామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకపోతే సహించేదిలేదని హెచ్చరించారు.
రిమ్స్ డైరెక్టర్‌పై ఎమ్మెల్యే రామన్న ఆగ్రహం
పేదలకు దుప్పట్లు పంపిణీ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదాతల పట్ల దురుసుగా ప్రవర్తించిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే... డైరెక్టర్ తీరును దుయ్యబట్టారు. సమాజానికి సేవ చేసేవారిని ప్రొత్సహించాలని చెప్పారు. కొంతమంది అధికారులు వారి పనితీరు మార్చుకోవాలని హితవు పలికారు.
ఇదీ చూడండి :స్పోర్ట్ బైక్‌పై మంత్రి శ్రీనివాస్ గౌడ్