ఎమ్మెల్యే జోగురామన్న ఆదిలాబాద్ గ్రామీణ మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. మండలంలోని కచ్కంటి, మాలోబోరిగాం, పిప్పల్ధరి, యాపల్‌గూడ, లింగుగూడ గ్రామాలను సందర్శించారు. అక్కడి మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. తొలుత ఆదివాసీల ఆరాధ్య దైవం కుమురం భీం విగ్రహానికి పూలు వేసి నివాళులు అర్పించారు.
మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జోగురామన్న - ఆదిలాబాద్లో జోగురామన్న పర్యటన
ఆదిలాబాద్లో ఎమ్మెల్యే జోగురామన్న పర్యటించారు. అక్కడి మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. త్వరలో జరిగే జడ్పీటీసీ ఉపఎన్నికల్లో తెరాస అభ్యర్థినే గెలిపించాలని కోరారు.

మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ చేసిన ఎమ్మెల్యే జోగురామన్న
తెరాస పాలనతో కలిగిన ప్రయోజనాలు గ్రామాలవారీగా వివరించారు. త్వరలో జరిగే జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థినే గెలిపించాలని అభ్యర్థించారు. తమ వారిని గెలిపిస్తే మరింత ఉత్సాహంగా పనిచేసి అభివృద్ధికి బాటలు వేస్తామని చెప్పారు.
- ఇదీ చూడండి:వరుణుడు పగబట్టాడా.. మరో భారీ వర్షసూచన